ఓయూ జాక్
Osmania University Joint Action Committee
Friday, October 29, 2010
Monday, October 25, 2010
డిజిపి వాఖ్యలపై ఓయు విద్యార్థుల ఆగ్రహం

తెలంగాణపై అమానుష వాఖ్యలు చేశారంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు డిజిపి అరవిందరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణపై ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీసు అధికారి మాట్లాడవలసిన మాటలు ఆయన మాట్లాడలేదని వారు ధ్వజమెత్తారు. తెలంగాణ పేరుతో నక్సలైట్లు పుట్టుకు వస్తున్నారన్న ఆయన వాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. డిజిపి అరవిందరావు ఆదివారం వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం పేరిట నక్సలైట్ల కదలికలు పెరుగుతున్నాయా అనే కోణంలో సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. ఉద్యమాన్ని అవకాశంగా తీసుకొని నక్సలైట్లు రాజకీయాల్లోకి వస్తే పట్టించుకోమని, కానీ ఆ పేరుతో నక్సలిజాన్ని బలోపేతం చేసి హింసవైపు పయనించాలని చూస్తే పోలీసు శాఖ అప్రమత్తంగానే ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ ఉద్యమమని, దాన్ని అణిచివేయటం మా ఉద్యోగం కాదని, శాంతిభద్రతలు రక్షించటం మా ఉద్యోగమని వాఖ్యానించారు. ఉద్యమం చేసేటప్పుడు ఇతర పార్టీల విషయంలో ఎలా వ్యవహరిస్తామో ఇప్పుడు అలానే వ్యవహరిస్తామన్నారు. ఈ మాటలపై ఓయు విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sunday, October 24, 2010
తెలంగాణా ప్రజాప్రతినిధుల దిష్టిబోమ్మను దగ్ధం చేసిన ఓయూ జాక్
తెలంగాణాకు ప్రత్యేక ఎపిపిఎస్ ను నిర్వహించడంలో విఫలం ఐన ప్రజాప్రతినిధులు తెలంగాణను తెస్తారా? అంటూ ప్రజాప్రతినిధుల వైఖరికి నిరసనగా ఆర్ట్స్ కాలేజ్ ముందు రోడ్దుపై రాస్తారోకో నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ కార్యక్రమంలో బండారి వీరబాబు,నెమ్మాది రవి,గెళ్లు శ్రీనివాస్,మర్రీ అనిల్,శ్రీహరి,లోకేష్ యాదవ్,శ్రీధర్ తదితరులు పాల్గోన్నారు.
డిటెన్షన్ విదానాన్ని రద్దు చేయాలని ధర్నా
ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రస్తుత విద్యాసంవత్సరానికి డిటెన్షన్ విదానాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి విభాగం ఆధ్వర్యంల్లో ఉస్మానియా యూనివర్శిటి పరిపాలన భవనం ముందు అంధోళన నిర్వహించారు.తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు చురుకుగా పాల్గొనడం వలన విద్యార్థులు పరీక్షలు సరిగ్గ రాయలేకపొయారని అందువలన డితెన్షన్ విదానాన్ని రద్దు చేసి వారిని రెండవ సెమిస్టర్ కి ప్రమోట్ చేసి మళ్ళి రాసేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి విభాగం యూనివర్శిటి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.
Subscribe to:
Posts (Atom)

