నిన్న ఒక ప్రైవేట్ చానల్ లో (ABN) జరిగిన చర్చల సందర్బంగా తెలంగాణలో పుట్టిన తెలంగాణేతరులంతా తెలంగాణ వారే అన్న కేసిర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్శిటి జాయింట్ యాక్షన్ కమిటి ప్రతినిధులు ఈరోజు సాయంత్రం యూనివర్శిటిలోని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కేసిర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. కేసిర్ వ్యాఖ్యలు తేలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న అమరుల త్యాగలను అవమానించే విధంగా ఉన్నాయని వెంటనే కేసిర్ క్షమాపన చెప్పాలని జాక్ ప్రతినిధులు పేర్కోన్నారు.