Friday, October 22, 2010

క్యాంపస్ కబుర్లు...పేపర్ కటింగ్స్



ఓయూలో - కొమరం భీం వర్ధంతి సభ


ఆదివాసి, దళిత బలహీన వర్గాల ఆరాధ్య దైవం గిరిజన వీరుడు కొమరం భీం వర్ధంతి సభ  ఓయూ జాయింట్ యాక్షన్ కమిటి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య ముఖ్యవక్తగా విచ్చేసి మాట్లాడాడు.కొమరంభీం జల్,జంగ్,జమీన్,అనే నినాదం తొ హక్కులకోసం పోరాడిన యోదుడని కొమురం భీం కొనియాడాడు. ఈ కార్యాక్రమంలో జాక్ నాయకులు వంగపల్లి శ్రినివాస్, స్టాలిన్,దరువు అంజయ్య, లింగస్వామీ,మందాల భాస్కర్,విజయ్ తదితరులు పాల్గొన్నారు                            

"తీన్ మార్ తడాఖా" పొస్టర్ ను విడుదల చేసిన ఓయూ ప్రొఫెసర్ కంచ ఐలయ్య


"దోరల తెలంగాణని ధ్వంసం చేద్దాం - బహుజన తెలంగాణని సాధిద్దాం" అనే నినాదంతో అక్టోబర్ 31వ తేది న ఉస్మానియా రిసర్చ్ స్కాలర్ వరంగల్ రవి "తీన్ మార్ తడాఖా" పేరుతో నిర్వహించ తలపెట్టిన సభకు సంబందించిన వాల్ పోస్టర్ ను ఉస్మానియా యూనివర్శిటి ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిద కళాకారులు పాల్గోన్నారు.          

14వ రోజుకు చేరుకున్న ఓయూ జాక్ నిరహార దీక్ష

నవంబర్ 1 వ తేది అంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం రద్దు చేసుకోవాలని. తెలంగాణ విద్రోహ దినంగా  ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ ఓయూ జాక్ నేతలు నిర్వహిస్తూన్న రిలే నిరహార దీక్షలు 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను ఉద్యేషించి జాక్ కన్వీనర్ పిడమర్తి రవి మాట్లాడాడు.ఈ కార్యక్రమంలో జాక్ నేతలు పిడమర్తి మర్రీ అనిల్,బండారి వీరబాబు,బాల్ రాజు,గాదేరి కిషోర్ ,ప్రవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.